అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasthan | ఈత సరదా ప్రాణం తీసింది. సరదాగా మిత్రులతో కలిసి విహార యాత్రకు వెళ్లి నదిలో మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ (Rajasthan ) రాష్ట్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని జైపూర్ ఘాట్గేట్, హసన్పుర ప్రాంతానికి చెందిన టోంక్ జిల్లా బనాస్ నది (banas river) వద్దకు విహార యాత్రకు వచ్చారు. ఇందులో నుంచి 11 మంది సరదా ఈత కొడదామని నదిలో దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో వారు మునిగిపోయారు. ఒడ్డున వారు గమనించి స్థానికుల సాయంతో ముగ్గురిని కాపాడారు. ఎనిమిది మంది నీట మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.