ePaper
More
    HomeFeaturesChatGPT | చాట్​ జీపీటీ సేవల్లో అంతరాయం

    ChatGPT | చాట్​ జీపీటీ సేవల్లో అంతరాయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ChatGPT | ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రతి పనిని చిటికెలో చేసి పెడుతోంది. విద్యార్థుల హోం వర్క్​ నుంచి మొదలు పెడితే.. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ల కోడింగ్​ వరకు ఏఐ చేయగలదు. దీంతో ఏఐకి అలవాటు పడిన ప్రజలు.. అది కాసేపు పనిచేయకపోతే ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ చాట్ జీపీటీ(ChatGPT) సేవల్లో మంగళవారం అంతరాయం కలిగింది. దీంతో యూజర్లు సోషల్​ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

    ChatGPT | ప్రపంచవ్యాప్తంగా..

    ప్రస్తుతం ఉన్న ఏఐ టూల్స్​లో చాట్​ జీపీటీ ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి సర్వర్​ డౌన్​ కావడంతో యాప్​ పనిచేయలేదు. ఈ ఏడాది చాట్ జీపీటీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి. మ‌ధ్యాహ్నం 2.45 నుంచి భారత్​ (India)లో చాట్ జీపీటీ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింద‌ని వంద‌ల సంఖ్యలో యూజ‌ర్లు ఫిర్యాదు చేశారు. భారత్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాట్​ జీపీటీ సేవలు స్తంభించిపోయాయి అని తెలుస్తోంది. కాగా సేవల్లో అంతరాయంపై చాట్​ జీపీటీ సంస్థ స్పందించింది. కొందరు యూజర్లకు అంతరాయం కలిగిందని, సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...