అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | ఆర్మూర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) 34వ వార్డును సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చారు. రెండురోజుల్లో ఇళ్లను కూల్చివేయాలని వారిని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిల భవనాల్లో నివసించడం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీవో (armoor Municipal TPO) ఆంజనేయులు, సిబ్బంది తదితరులున్నారు.