అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కుట్రలో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ నిజామాబాద్(Nizamabad BRS) జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాజకీయంగా కేసీఆర్‌ను(KCR) ఎదుర్కోలేకనే కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని తెలంగాణ ప్రజలు బ్లాక్‌డేగా (Black Day) పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఫిరాయింపులు, పేమెంట్ కోటాలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వద్ద సీఎం ఉద్యోగం సంపాదించారని ఎద్దేవా చేశారు. కేసులు, విచారణలకు కేసీఆర్ భయపడే రకం కాదని ఆయన స్పష్టం చేశారు.
