ePaper
More
    Homeఅంతర్జాతీయంAustria | ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పుల మోత‌.. 8 మంది దుర్మ‌ర‌ణం

    Austria | ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పుల మోత‌.. 8 మంది దుర్మ‌ర‌ణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Austria | ఈ మ‌ధ్య కాలంలో దుండ‌గలు నిర్ధాక్షిణ్యంగా కాల్పులు (firing) జ‌రుపుతూ అమాయ‌కుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవ‌ల ప‌హ‌ల్​గామ్​లో(Pahalgam) 26 మందిని క‌న్నుమూశారు. ప్ర‌కృతిని ఆస్వాదించేందుకు వ‌చ్చిన వారిని దారుణంగా పొట్ట‌న పెట్టుకున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఒక్క మ‌న‌దేశంలోనే కాదు ఇత‌ర దేశాల‌లో కూడా జ‌రుగుతున్నాయి. అమెరికాలోని పలు సూళ్లలో దుండగులు కాల్పులకు తెగబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఆస్ట్రియాలోని (Austria) ఓ స్కూల్​లో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. దుండగులు కాల్పుల తెగబడడంతో సుమారు 8 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. గ్రాజ్ నగరంలో (Graz City) ఈ స్కూల్ ఉండ‌గా, అక్క‌డ‌ కాల్పులు జ‌రిగాయ‌ని సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు.

    Austria | దారుణం..

    ఆస్ట్రియా(Austria School)లోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని స్కూల్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. షూటింగ్ ఘ‌ట‌న‌కు ధీటుగా పోలీసులు (Police) స్పందిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. బాధితుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయ‌ప‌డ్డారు. ఇందులో విద్యార్థులు, టీచ‌ర్లు(students and teachers) ఉన్న‌ట్లు కూడా తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్ట‌గా, ఆ ప్రాంతంలో సెకండ‌రీ స్కూల్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై పూర్తి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. గాయపడ్డ వారి వివరాలను కూడా వెల్లడించలేదు.

    స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన సమాచారం అందగానే ప్రత్యేక పోలీసు దళాలు(Special police forces) స్కూల్‌కు చేరుకున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరం గ్రాజ్. దేశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. ఇక్కడి జనాభా సుమారు 3 లక్షలు. ఆ ప్రాంతంలో ఇలాంటి కాల్పుల ఘ‌ట‌న జరగడంతో అంద‌రూ ఉలిక్కిపడ్డారు. ఘటనలో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన క‌లిగించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ (investigation) చేపట్టారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...