ePaper
More
    Homeటెక్నాలజీMotorola Edge 60 | మిడ్‌ రేంజ్‌లో మోటో కొత్తఫోన్‌

    Motorola Edge 60 | మిడ్‌ రేంజ్‌లో మోటో కొత్తఫోన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Motorola Edge 60 | మోటోరొలా(Motorola) సంస్థ ఆకర్షణీయమైన డిజైన్‌, అధునాతన కెమెరా సెటప్‌తో కొత్త మోడల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. తన ఫ్లాగ్‌షిప్‌ ఎడ్జ్‌(Edge) సిరీస్‌లో మోటోరొలా ఎడ్జ్‌ 60 పేరుతో దీనిని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart), మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌లతోపాటు రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఈనెల 17నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ మోడల్‌ ఫోన్‌ ఫీచర్లు తెలుసుకుందామా..

    • Display : 6.67 అంగుళాల సూపర్‌ హెచ్‌డీ+ 1.5k pOLED క్వాడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే. 120 Hz రిఫ్రెష్‌ రేటు, 4,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. హెచ్‌డీఆర్‌10+ సపోర్ట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌తో లభిస్తోంది.
    • Processor : మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్‌ చిప్‌సెట్‌.
    • Operation system : ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత హల్లో యూఐ. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్‌, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
    • Camera : ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌. 50MP సోనీ ఎల్‌వైటీఐఏ 700సీ ప్రైమరీ సెన్సార్‌, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 10MP టెలిఫొటో కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 50 MP కెమెరా అమర్చారు. ఏఐ ప్లేలిస్ట్‌ స్టూడియో, ఏఐ ఇమేజ్‌ స్టూడియో, గూగుల్‌ ఫొటోస్‌ ఏఐ వంటి ఏఐ మోటో ఫీచర్లున్నాయి.
    • Battery : 5,500mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ 68w ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌.
    • Durability : ఐపీ68/ఐపీ69 రేటింగ్‌ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌.
    • Variant : 12GB RAM + 256GB Storage. ధర రూ. 25,999.

    Motorola Edge 60 | Offers..

    ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో ఈ మోడల్‌ ఫోన్‌ కొనుగోలు చేసేవారికి వెయ్యి రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా రూ. 1,250 వరకు క్యాష్‌ బ్యాక్‌ వర్తిస్తుంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...