ePaper
More
    Homeక్రైంAnantapur | ఇంటర్​ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

    Anantapur | ఇంటర్​ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anantapur | అనంతపురం(Anantapur) జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం ఎస్పీ జగదీశ్(SP Jagadeesh)​ కేసు వివరాలు వెల్లడించారు. నరేశ్​ అనే వ్యక్తి తన్మయిని హత్య చేశాడని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

    నగరంలోని రామకృష్ణానగర్‌కు చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంటర్​ చదువుతున్న తన్మయి ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 7న తన్మయి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతోనే తమ కూతురు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    Anantapur | ప్రేమ పేరుతో దగ్గరై..

    ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. తన్మయికి మూడు నెలల క్రితం నరేశ్​ పరిచయం అయ్యాడు. నెల క్రితం నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి(Marriage) చేసుకుందామని చెప్పి తన్మయిని తీసుకెళ్లి నరేశ్​ బండరాయితో కొట్టి హత్య చేశాడు. అయితే నరేశ్​కు అంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. దీంతో తన్మయిని హత్య చేసినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. నిందితుల ప్రభుత్వ పథకాలను రద్దు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వన్​ టౌన్​ ఇన్​స్పెక్టర్​ రాజేంద్రనాథ్​ యాదవ్​ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

    More like this

    Vote Chori | ప్ర‌ధానిపై కాంగ్రెస్ ఏఐ వీడియో.. అన్ని హ‌ద్దులు దాటింద‌ని బీజేపీ విమ‌ర్శ‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయ‌న మాతృమూర్తిని కించ‌ప‌రిచిన వివాదం చెలరేగిన...

    Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద.. నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్ (Nizam Sagar)​కు ఎగువ నుంచి భారీగా వరద...

    Asia Cup | పోరాడే ల‌క్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచిన హాంకాంగ్.. అయిన‌ప్ప‌టికీ..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ విజయవంతమైన ఆరంభాన్ని నమోదు చేసుకుంది....