అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
