అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Wardhannapet | ఓ ఎస్సై తీరుతో దంపతులు తమ ఇద్దరు పిల్లలతో రాత్రంతా రోడ్డుపైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఘటన వరంగల్ (Warangal) జిల్లా వర్ధన్నపేట మండలంలో చోటు చేసుకుంది.
బాధితుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో సోమవారం రాత్రి బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్దన్నపేట ఎస్సై(Wardhannapet SI) ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. అయితే పోలీసుల వద్ద బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సై ఆయనపై చేయి చేసుకున్నాడు. అంతేగాకుండా బైక్‌తో పాటు సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు తమ కుటుంబాన్ని అడవిలోనే వదిలేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు. తాము రాత్రంతా రోడ్డుపైనే దిక్కుతోచని స్థితిలో కూర్చున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.