ePaper
More
    HomeతెలంగాణElectricity Employees | విద్యుత్ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

    Electricity Employees | విద్యుత్ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Electricity Employees | విద్యుత్ శాఖ ఉద్యోగులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం (state government) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

    విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ (insurance) ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఎస్​బీఐ(SBI)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సమక్షంలో అగ్రిమెంట్​ చేసుకుంది. ఈ పథకం కింద.. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి బీమా అందించబడుతుంది.

    ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉద్యోగులకు (electricity department employees) కోటి రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకం అమలు దేశంలో ఇదే తొలిసారన్నారు. ఇందిరమ్మ రాజ్యం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఇలాంటి గొప్ప నిర్ణయాలు సాధ్యమవుతాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి బీమాను తీసుకురాలేదని చెప్పారు. ఇది ఉద్యోగుల్లో  ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందన్నారు. 

    Electricity Employees | కొత్త ఎనర్జీ పాలసీ

    తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కొత్త ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో 2029-30 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని చెప్పారు. డిమాండ్​కు అనుగుణంగా ట్రాన్స్ మిషన్​ను అప్ డేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తున్న విద్యుత్ శాఖ  ఉద్యోగుల కుటుంబాలు కూడా ధైర్యంగా, నమ్మకంగా ఉండేందుకు.. బీమా ఇస్తున్నట్లు చెప్పారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...