అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad city | అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఐదో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంనగర్ (Sitaram nagar) కాలనీకి చెందిన భూపతి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. అలాగే 15 రోజుల క్రితం ఆయన భార్య మృతి చెందింది. దీంతో మానసికంగా కృంగిపోయిన భూపతి సోమవారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు కూతురు ఉండగా ఆమె హైదరాబాద్లో చదువుకుంటోంది. తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
