అక్షరటుడే, వెబ్డెస్క్: MUDA Scam | ముడా స్కామ్లో ఈడీ(ED) దూకుడు పెంచింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం సతీమణి నుంచి ముడా భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరు(Mysore)లో విలువైన భూములు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీతో పాటు, లోకాయుక్త దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ కేసులో భాగంగా ఈడీ రూ.100 కోట్ల విలువైన 92 ప్లాట్లను తాజాగా అటాచ్ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో రూ.400 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం గమనార్హం.