అక్షరటుడే, వెబ్‌డెస్క్:Los Angeles | అమెరికాలోని కీలక నగరమైన లాస్ ఏంజెలెస్ రణరంగంగా మారింది. అగ్రరాజ్యంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.
అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఇటీవల ట్రంప్ (Donald Trump) పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇమ్మిగ్రేషన్ (Immigration), కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (Customs Enforcement officers) లాస్ ఏంజెలెస్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా నగరంలో ఆందోళనలు చేపడుతున్నారు.
Los Angeles | వాహనాలు నిప్పు.. దుకాణాల లూటీ
లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు అణచివేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేగాకుండా రోడ్లపై వాహనాలతో బీభత్సం సృష్టిస్తున్నారు. పలు వ్యాపార సముదాయాల్లోకి చొరబడి లూటీ చేస్తున్నారు. ఆందోళనలు అణచి వేయడానికి పోలీసులు బాష్పవాయువు (Tear gas), రబ్బర్ బుల్లెట్లను (rubber bullets) ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Los Angeles | మాస్క్ పెడితే లోపలేయండి
ఆందోళనకారులు మాస్క్‌లు పెట్టుకొని నిరసనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ మాస్క్‌తో కనిపించిన అందరిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. తాజాగా అల్లర్లను అణచివేయడానికి అమెరికాలోని కీలకమైన మెరైన్ గార్డు(Key Marine Guard)లను ట్రంప్ లాస్ ఏంజెలెస్ నగరానికి పంపించారు. దాదాపు డజనుకుపైగా బస్సులు ట్వంటీనైన్ పామ్స్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు వెళ్తున్నాయి. 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్లు (Active duty Marines) లాస్ ఏంజెలెస్‌లో దిగనున్నారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై వీరు ఉక్కుపాదం మోపనున్నారు.