అక్షరటుడే, వెబ్డెస్క్: Delhi fire incident | ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Major fire accident) చోటు చేసుకుంది.
ఢిల్లీలోని ద్వారకలో గల శబ్ద్ అపార్ట్‌మెంట్ (Dwarka Shabd Apartment) ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అపార్ట్మెంట్లోని కింది అంతస్తుల్లో ఉన్నవారు వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో చిక్కుకున్న ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేస్తున్నారు. భవనంలో ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. భారీ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.