అక్షరటుడే, వెబ్‌డెస్క్: MPL 2025 | క్రికెట్(Cricket)లో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు చూసి మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. తాజాగా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) 2025లో జరిగిన ఒక మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయే రనౌట్(Run Out) జరిగింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(Maharashtra Cricket Association Stadium)లో పుణేరి బప్పా vs రాయ్‌గడ్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఆరో మ్యాచ్‌లో, తొలి ఓవర్‌లోనే ఒక అద్భుతమైన, వింతైన రన్‌అవుట్ చోటు చేసుకోవడం విశేషం.. ఒకే ఒక్క త్రోతో వికెట్ కీపర్ రెండు వైపులా ఉన్న స్టంప్స్‌ను పడగొట్టడం క్రికెట్ చరిత్రలోనే అరుదుగా కనిపిస్తుంది. ఈ వింత ఘటన పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పుణెరి బప్పా(Puneri Bappa), రాయ్‌గడ్ రాయల్స్(Raigad Royals) జట్ల మధ్య ఈ నెల 7న జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
MPL 2025 | వెరైటీ రనౌట్
రాయ్‌గడ్ రాయల్స్ వికెట్ కీపర్ సూరజ్ షిండే ఒకే త్రోకి రెండు సెట్ల స్టంప్‌లు పడడం ద్వారా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టానికి కారకుడయ్యాడు. రామకృష్ణ ఘోష్ వేసిన బంతిని సిద్దేష్ వీర్ లెగ్ సైడ్ వైపునకు ఆడగా, అతను ప్రమాదకర సింగిల్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతిని వేగంగా అందుకున్న కీపర్ షిండే(Keeper Shinde), స్ట్రైకర్ ఎండ్‌లోకి నేరుగా త్రో విసిరాడు. వీర్ అప్పటికే సేఫ్‌గా క్రీజ్‌కి చేరుకున్నాడు. అయితే ఆ త్రో స్టంప్‌లను Stumps తాకిన తర్వాత వెనక్కి తిరిగి పిచ్ మీద తిరిగి వెళ్లి నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి చేరింది. అక్కడ మళ్లీ స్టంప్‌లను తాకడంతో, రెండో బ్యాటర్ హర్ష్ మొగవీర రనౌట్ అయ్యాడు. రీప్లేలో ఈ అవుట్ చట్టబద్ధమని నిర్ధారించాయి.