ePaper
More
    HomeజాతీయంSouth Central Railway | తగ్గనున్న దక్షిణ మధ్య రైల్వే పరిధి

    South Central Railway | తగ్గనున్న దక్షిణ మధ్య రైల్వే పరిధి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: South Central Railway | సికింద్రాబాద్(Secunderabad)​ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఒకప్పుడు దేశంలోనే ఐదో స్థానంలో ఉన్న ఈ జోన్​ ప్రస్తుతం తన స్థానాన్ని కోల్పోనుంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్​ను ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ(Railway Department) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జోన్ల విభజనతో దక్షిణ మధ్య రైల్వే పరిధి 6,400 కిలోమీటర్ల నుంచి 2500 కి.మీ.లకు తగ్గనుంది.

    South Central Railway | ఘన చరిత్ర

    దక్షిణ మధ్య రైల్వేకు ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలంలో హైదరాబాద్ కేంద్రంగా నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే(Nizam Guaranteed State Railway) సేవలు ఆరంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక 1966లో దీనిని దక్షిణ మధ్య రైల్వే జోన్​గా ఏర్పాటు చేశారు. దీని పరిధిలో తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంతభాగంతో కలిపి మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. ఈ జోన్​ పరిధిలో ప్రస్తుతం నిత్యం 650 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. 12 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

    South Central Railway | విశాఖ కేంద్రంగా నూతన జోన్

    కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దక్షిణకోస్తా జనరల్ మేనేజర్(South Coast General Manager) నియామకం కూడా పూర్తయింది. దీంతో మరి కొద్ది రోజుల్లోనే జోన్​ విభజన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిధితో పాటు ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు. ప్రస్తుతం సౌత్​ సెంట్రల్​ రైల్వే(South Central Railway)లో ఆరు డివిజన్లు ఉండగా.. విభజన తర్వాత మూడుకు తగ్గనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే జోన్ పరిధిలో ఉంటాయి.

    South Central Railway | తగ్గనున్న ఆదాయం

    ప్రస్తుతం ప్రయాణికులు ఏ జోన్ నుంచి తమ ప్రయాణం ప్రారంభిస్తే.. టికెట్లపై వచ్చే ఆదాయం కూడా ఆ జోన్​కే చెందుతుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 12 లక్షల మంది ప్రయాణికుల ద్వారా రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తుంది. విభజన తర్వాత ప్రయాణికులతో పాటు ఆదాయం కూడా తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్​ నుంచి హైదరాబాద్(Hyderabad)​కు రాకపోకలు సాగించే వారి టికెట్ల ఆదాయం దక్షిణ కోస్తా జోన్​కు వెళ్లనుంది.

    South Central Railway | ఉద్యోగుల విభజన

    జోన్ల విభజనలో భాగంగా ఉద్యోగులను కూడా విభజించనున్నారు. ప్రస్తుతం ఆయా డివిజన్ల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు యథావిధిగా కొనసాగుతారు. అయితే హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న రైల్​ నిలయం, లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్, రైల్వే కేంద్రీయ ఆస్పత్రిలో సిబ్బందిని విభజించనున్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...