ePaper
More
    Homeబిజినెస్​Stock Market | ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు

    Stock Market | ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మంగళవారం ట్రేడింగ్‌ను పాజిటివ్‌గా ప్రారంభించినా గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద స్వల్ప ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో ప్రారంభ లాభాలు హరించుకుపోయాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 198 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో అక్కడి నుంచి నేల చూపులు చూస్తూ ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్‌ 4 వందల పాయింట్లు, నిఫ్టీ(Nifty) 140 పాయింట్లు పడిపోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 37 పాయింట్ల లాభంతో 82,482 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 25,132 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Market | రాణిస్తున్న ఐటీ షేర్లు..

    ప్రధానంగా ఐటీ(IT) షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ 1.96 శాతం లాభపడగా.. మెటల్‌ సూచీ 0.50 శాతం లాభంతో ఉంది. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, పవర్‌ స్టాక్స్‌ లాభాల బాటలో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.67 శాతం పడిపోగా.. ఇన్‌ఫ్రా 0.38 శాతం, రియాలిటీ 0.36 శాతం, టెలికాం 0.27 శాతం, బ్యాంకెక్స్‌(Bankex) 0.20 శాతం నష్టంతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.29 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.05 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 16 స్టాక్స్‌ లాభాలతో, 14 స్టాక్స్‌ నష్టాలతో కొనసాగుతున్నాయి. టెక్‌ మహీంద్రా(Tech Mahindra) 3.49 శాతం పెరగ్గా.. హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.78 శాతం, ఇన్ఫోసిస్‌ 1.65 శాతం, టీసీఎస్‌ 1.64 శాతం, టాటా మోటార్స్‌ 1.57 శాతం లాభాలతో కదలాడుతున్నాయి.

    Stock Market | Top losers..

    ఎటర్నల్‌(Eternal) 1.19 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.04 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1 శాతం, ఆసియా పెయింట్‌ 0.99 శాతం, సన్‌ఫార్మా 0.65 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...