అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. హరీశ్‌రావు ఎన్నిక చెల్లదంటూ సిద్దిపేట ఎమ్మెల్యే బీఎస్పీ తరఫున పోటీచేసిన చక్రధర్‌గౌడ్(Siddipet MLA Chakradhar Goud) వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో హరీశ్‌రావు సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. హరీశ్‌రావు తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. అనంతరం చక్రధర్‌గౌడ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.
Harish Rao | గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ పేరిట రైతులకు చేయూత అందిస్తూ ఉంటారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఆయన బీఆర్ఎస్(BRS) హయాంలో హరీశ్‌రావుపై అనేక విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయనను బీఆర్ఎస్ ప్రభుత్వం చీటింగ్ కేసు(Cheating case)లో అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో చక్రధర్ గౌడ్ బీఎస్పీ నుంచి సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చక్రధర్‌గౌడ్ హస్తం గూటికి చేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై గతంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) పెట్టారు. తన ఫోన్‌ను హరీశ్ట్యాప్ చేయించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Punjagutta Police Station)లో కేసు పెట్టగా.. హైకోర్టు కోట్టి వేసింది. తాజాగా ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ సైతం న్యాయస్థానం తోసిపుచ్చడం గమనార్హం.