Mashrooms
Mushrooms | పోష‌కాల నిల‌యం పుట్ట‌గొడుగులు.. వీటితో పుట్టెడు లాభాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్:Mushrooms | మ‌న చిన్న‌ప్పుడు ఊర్ల‌ల్లో పుట్ట‌గొడుగులు Mushrooms ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చూసేవాళ్లం. మ‌న‌కు దానిలో ఉన్న ప్రోటీన్స్ మ‌న‌కు తెలియవు. ఇప్పుడిప్పుడే దానిలో ఉన్న పోష‌కాల‌ గురించి అంద‌రు తెలుసుకుంటున్నారు. పుట్టగొడుగు ను ఇంగ్లీషులో మష్రూమ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి. అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు(Nutritional supplements), ఔషదగుణాలు(medicinal properties) లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . ఇవి మాంసాహారముతో సమానము.ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి

Mushrooms | ఆరోగ్యానికి చాలా మేలు..

పుట్టగొడుగుల్లో విటమిన్ డి2, విటిమిన్ డిలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి. విటమిన్ డి Vitamin D లోపంతో బాధపడేవారు. వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. పుట్టగొడుగుల్లో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. పుట్టగొడుగుల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని కంట్రోల్(BP control) చేస్తాయి. అంతేకాకుండా, వీటిని తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం(Calcium) ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. శరీరానికి యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని Body కణాలను రిపేర్ చేస్తుంది. పుట్టగొడుగుల్లో ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్(Plant Based Compounds) ఉంటాయి. ఇవి రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి.