ePaper
More
    Homeటెక్నాలజీApple IOS 26| లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో ఐఓఎస్ 26ని విడుద‌ల చేసిన యాపిల్‌.. ప‌దేళ్ల...

    Apple IOS 26| లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో ఐఓఎస్ 26ని విడుద‌ల చేసిన యాపిల్‌.. ప‌దేళ్ల త‌ర్వాత పెద్ద మార్పులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Apple IOS | ప్ర‌ముఖ సంస్థ యాపిల్(Apple) ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త మార్పుల‌తో వినియోగ‌దారుల‌ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఐవోఎస్ 7 తో ఉన్న ఫ్లాట్ డిజైన్ ట్రెండ్ కు ముగింపు పలుకుతూ కొత్త ఐవోఎస్(New IOS) ను లాంచ్ చేస్తోంది. ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(Worldwide Developers Conference) లో ఈ కొత్త అప్డేట్ గురించి అధికారికంగా ప్ర‌క‌టించింది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఇది పెద్ద మార్పుగా చెప్ప‌వ‌చ్చు. IOS26లో కొత్తగా లిక్విడ్ గ్లాస్ డిజైన్(Liquid glass design) ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇది గాజులా ఉండి పారదర్శకత, లోతైన షేడింగ్, అలాగే మృదువైన అనుభూతిని కలిగిస్తుంది.

    Apple IOS 26 | IOS 26 లాంచ్…

    ఇక రెటీనా డిస్ప్లేల్లో A6 సిలికాన్ తో అద్భుతమైన టెక్నాలజీ కలిగి ఉంటుందని యాపిల్ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ కొత్త డిజైన్, ఆపిల్ విజన్ ప్రో వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌తో గతంలో ప్రవేశపెట్టబడిన కంపెనీ విజన్‌ఓఎస్(VisionOS) నుండి స్పష్టంగా ప్రేరణ పొందిందని చెప్పారు. యాప్‌లు, సిస్టమ్ సెట్టింగ్స్‌, మెనూలన్నీ ఈ డిజైన్‌లో చక్కగా పనిచేయనున్నాయి. యాపిల్ ప్రోడెక్ట్ కు సంబంధించి లాప్ ట్యాప్, ఐపాడ్, ఐఫోన్, వాచ్ అన్నింటిలో దీనిని తీసుకురానున్నారు. Apple Vision Proలో కనిపించే visionOS డిజైన్ శైలికి ఇది చాలా దగ్గరగా ఉండనుంది. ఫోన్ లో కాల్ స్క్రీనింగ్, హోల్డ్ అసిస్ట్ ఫీచర్లతో కొత్త లేఅవుట్‌ రానుంది. మెసేజ్ యాప్ లో థీమ్/బ్యాక్‌గ్రౌండ్‌ సపోర్ట్, గ్రూప్ చాట్స్‌లో పోల్స్, టైపింగ్ ఇండికేటర్స్ కొత్తగా రానున్నాయి.

    యాపిల్ ఫేస్ టైమ్ కు సంబంధించి ఆపిల్ ఇంటలిజెన్స్ ఆధారిత లైవ్ ట్రాన్సలేషన్ ఫీచర్(Live translation feature) ను తీసుకురాబోతుంది. అలాగే UIతో కెమెరాకు కొత్త డిజైన్..ఫోటో యాప్ లో మెరుగైన ట్యాబ్స్, బ్రౌజింగ్ ఫీచర్స్ ను తీసుకురానున్నారు. సఫారీలో ఎడ్జ్-టు-ఎడ్జ్ వ్యూవ్‌ తో మరింత ఇంటరాక్టివ్ వెబ్ బ్రౌజింగ్ ను కూడా తీసుకురానున్నారు. అంతేకాదు యాపిల్ గేమ్స్ అనే కొత్త యాప్ ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జూన్ 10న బీటా వెర్షన్ విడుదల చేస్తారు. జూలై తర్వాత నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. Apple తన 2025 వార్షిక ప్రపంచ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) లో iOS 26 ను ప్రకటించింది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...