Thunderstorm
Thunderstorm | ఈదురుగాలుల బీభత్సం.. ఇద్దరి మృతి

అక్షరటుడే, బాన్సువాడ: Thunderstorm | ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వీయడంతో చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విద్యుత్​ తీగలపై పడడంతో విద్యుత్​ స్తంభాలు(Electricity poles) నేలకూలాయి. గాలుల దాటికి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాలివేగానికి దాబాపై నుంచి పడి చనిపోగా.. మరొకరు చెట్టుకొమ్మ విరిగి మీద పడడంతో మృతి చెందారు.

Thunderstorm | మేడపై నుంచి పడి..

భారీ ఈదురుగాలులకు మేడపై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన బాన్సువాడ(Banswada)లో చోటు చేసుకుంది. తాడ్కోల్ శివారులోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్​లో ప్రభు అనే వ్యక్తి డాబాపై పడుకున్నాడు. ఈదురుగాలులు వీయడంతో ఆయన లేచి నిలబడ్డాడు. ఈ క్రమంలో గాలిదాటికి దాబా పైనుంచి ఎగిరి కిందపడ్డాడు. భవనంపై నుంచి భారీ శబ్దం రావడంతో కాలనీ వాసులు వచ్చి చూసేసరికి ప్రభు మృతి చెందాడు.

Thunderstorm | చెట్టు కొమ్మ పడి..

నిజామాబాద్​ నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో పులాంగ్ అంగిటి దాబా వెనుక కల్లు కాంపౌండ్​లో చెట్టు విరిగి పడడంతో ఒకరు మృతి చెందారు. వినాయక్​ నగర్(Vinayaka Nagar) ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(35) అక్కడ కూర్చుని కల్లు తాగుతున్నాడు. ఆ సమయంలో ఈదురుగాలుల దాటికి చెట్టు కొమ్మ విరిగి ఆయనపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. శ్రీనివాస్​ విద్యుత్​ శాఖ(Electricity Department)లో పని చేస్తున్నాడు.