ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. యూరోప్‌ మార్కెట్లు నెగెటివ్‌లో ఉండగా.. ఆసియా మార్కెట్లలో జోష్‌ కంటిన్యూ అవుతోంది. యూఎస్‌ మార్కెట్లలోనూ ర్యాలీ కొనసాగింది.

    Pre Market Analysis : అమెరికా మార్కెట్లు(US markets)..

    నాస్‌డాక్‌(Nasdaq) 0.31 శాతం, ఎస్‌అండ్‌పీ 0.09 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.32 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    డీఏఎక్స్‌(DAX) 0.54 శాతం, సీఏసీ 0.17 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.30 శాతం నష్టంతో ముగిశాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు(Asian markets) సోమవారం ఉదయం దూసుకుపోతున్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(Taiwan stock exchange) 1.95 శాతం, నిక్కీ 1 శాతం, కోస్పీ 0.78 శాతం, హంగ్‌సెంగ్‌ 0.34 శాతం, షాంఘై 0.08 శాతం లాభాలతో ఉన్నాయి. స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.26 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 1,992 కోట్ల విలువైన స్టాక్స్‌, డీఐఐ(DII)లు రూ. 3,503 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR)1.05 నుంచి 1.01కు తగ్గింది. విక్స్‌(VIX) 0.43 శాతం పెరిగి 14.69 వద్ద ఉంది.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.53 శాతం పెరిగి 65.64 డాలర్లకు చేరింది.
    • డాలర్‌తో రూపాయి (Rupee)మారకం విలువ 2 పైసలు బలపడి 85.63 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 0.27 శాతం పెరిగి 99.12కు, యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.27 శాతం పెరిగి 4.49 కు చేరాయి.
    • అమెరికా, చైనా(China) మధ్య వాణిజ్య చర్చలు మంగళవారం రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ చర్చలపై సానుకూల సంకేతాల నేపథ్యంలో యూఎస్‌(US), ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...