అక్షరటుడే, అమరావతి: Nara Lokesh : మహిళలను అవమానించే వాళ్లను బండకేసి కొట్టి, లోపల వేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. మహిళలపై వైకాపా(YSRCP) నేత సజ్జల చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేశ్ ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలు నిరసన తెలిపితే అవమానిస్తారా? అని మండిపడ్డారు.
“వైకాపా(YSRCP) నాయకుల ఆ భాష ఏంటి.. వారి ప్రవర్తన ఏంటి? మహిళలు నిరసన తెలిపితే.. వైకాపా నేతలకు తప్పుగా అనిపిస్తోందా? మహిళలను వైకాపా నేతలు కించపర్చేలా మాట్లాడుతున్నారు. కనిపెంచిన తల్లి, తోడబుట్టిన చెల్లిని తరిమేసిన జగన్ను వైకాపా నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. మహిళలంటే వైకాపా నేతలకు ఎందుకంత చిన్నచూపు? మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం”అని లోకేష్ హెచ్చరించారు.
“ఆల్రెడీ ఒకరి పని అయిపోయింది.. రెండో వ్యక్తి కోసం వెతుకుతున్నాం.. వాళ్లను బొక్కలో వేయడానికి రెండు నిమిషాల పని.. జరుగుతున్న వాటిని కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. గతంలో శాసనసభ(Legislative Assembly) సాక్షిగా నా తల్లిని అవమానించారు..” అని లోకేష్ పేర్కొన్నారు. అదే భారతి రెడ్డి(BHARATHI REDDY) గురించి టీడీపీ(TDP) కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే అతడిపై చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.