అక్షరటుడే, హైదరాబాద్: Gaddar Film Award : తెలుగు సినీ రంగా(టాలీవుడ్) (Tollywood)న్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కారు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల(Gaddar Telangana Film Awards)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు హైటెక్స్(HYTEX) వేదికగా ఈ నెల 14న అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించబోతోంది.
ఈ వేడుకలో విజేతలకు ప్రదానం చేసే గద్దర్ అవార్డు మెమోంటో(Gaddar Award Memento)ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ చలన చిత్రాభివృద్ధి సంస్థ(Telangana Film Development Corporation – TFDC) ప్రత్యేకంగా గద్దర్ మెమోంటోను రూపొందించింది. ఫిల్మ్ రీల్ చేతిని చుట్టుకొని, పైకెత్తిన చేతిలో డప్పు నమూనాతో గద్దర్ పురస్కారం మెమోంటోను చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. డప్పుపై తెలంగాణ రాష్ట్ర చిహ్నం ముద్రించారు. దాని చుట్టూ టీజీఎస్ఏ TGSA అక్షరాలు లిఖించారు.
చిత్ర పరిశ్రమలోని ఆయా రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఈ గద్దర్ మెమోంటోను బహూకరించున్నారు. ఇక గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. హైదరాబాద్ Hyderabad మహా నగరంలోని ముఖ్య కూడళ్లలో పెద్ద ఎత్తున హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం కల్పిస్తోంది.