ePaper
More
    HomeతెలంగాణInspector Transfers | పలువురు సీఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    Inspector Transfers | పలువురు సీఐల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Inspector Transfers | మల్టీ జోన్​ –1 పరిదిలో పలువురు సీఐలు బదిలీ (CI Transfers) అయ్యారు. మొత్తం పది మంది ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​రెడ్డి (IG Chandrasekhar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్​లైన్​లో ఉన్న కొందరికి పోస్టింగ్​లు ఇవ్వగా.. కీలక పోస్టింగ్​ల్లో ఉన్న వారిని ఆయా బాధ్యతల నుంచి తప్పించారు.

    పాలకుర్తి సీఐ మహేందర్​రెడ్డిని మహబూబాబాద్​ టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న పెండ్యాల దేవేందర్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. ట్రాన్స్ కోలో ఉన్న కందరి వినోద్​ను డిచ్పల్లి సీఐగా.. అక్కడ పని చేస్తున్న కొంక మల్లేశ్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. రామగుండం ఎస్​బీలో ఉన్న కరుణాకర్​ను జగిత్యాల టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా.. అలాగే అక్కడ పనిచేస్తున్న వేణుగోపాల్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు.

    చెన్నూర్​ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సుధాకర్​ను​ జగిత్యాల రూరల్ సీఐగా.. అక్కడ పనిచేస్తున్న కృష్ణారెడ్డిని ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. అలాగే వెయిటింగ్​లో ఉన్న మహేశ్​ను మెదక్​ టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా నియమించారు. అక్కడ కొనసాగుతున్న కొమళ్ల నాగరాజును ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. బదిలీ అయిన వారు అంతా సత్వరమే తమ నూతన పోస్ట్​లలో రిపోర్ట్​ చేయాలని ఐజీ ఆదేశించారు.

    Latest articles

    Janmashtami | హరే కృష్ణ.. కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janmashtami | ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి....

    Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. ఈ లెజెండ్‌ను సొంతం చేసుకోండి!

    అక్షరటుడే, ముంబై : Mahindra BE 6 | కొన్ని వాహనాలు కేవలం ఒక చోటు నుంచి మరో...

    Agniveer | అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్​బీఐ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Agniveer | దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత...

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు...

    More like this