అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Haryana | కొంతమంది యువకులు రోడ్లపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తుంటారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడతారు. బైక్‌లు, కార్లతో స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా రోడ్డుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తు రెండు కార్లతో రెచ్చిపోయిన నలుగురు యువకులకు హర్యానా(Haryana)లోని గురుగ్రామ్ పోలీసులు (Gurugram Police) షాక్ ఇచ్చారు.
హర్యానాలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (Dwarka Expressway)పై నలుగురు యువకులు రెండు కార్లలో ప్రమాదకరంగా ప్రయాణించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో గురుగ్రామ్ పోలీసులు స్పందించారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. మెర్సిడెస్ బెంజ్, స్కార్పియో కార్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను గురుగ్రామ్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. రోడ్లపై రెచ్చిపోయే పోకిరీలకు ఇలాంటి శిక్షే కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.