అక్షరటుడే, బాన్సువాడ: Short circuit | వర్ని మండల కేంద్రంలోని శ్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్ గోడౌన్లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించి. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఎంటర్ ప్రైజెస్ గోడౌన్లో మంటలు ప్రారంభమై పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (electrical short circuit) వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు, యజమాని రామకృష్ణ అనుమానిస్తున్నారు.
