ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ప్రభాకర్​రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    Phone Tapping Case | ప్రభాకర్​రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case) నిందితుడు, ఎస్​ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు (Prabhakar Rao)పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, ఆయనకు అమెరికాలో కేసీఆర్​ కుటుంబంతో కౌన్సెలింగ్​ అయిందన్నారు. అందులో భాగంగా పథకం ప్రకారమే విచారణకు హాజరయ్యాడని ఆరోపించారు. కాగా ఇటీవల మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అమెరికా (America)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన అనంతరం ప్రభాకర్​ రావు హైదరాబాద్​ చేరుకున్నారు. ఈ క్రమంలో సంజయ్​ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    Phone Tapping Case | భార్యాభర్తల ఫోన్లు ట్యాప్​ చేసిన నీచుడు

    భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు అని బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని ఆరోపించారు. పథకం ప్రకారమే ఆయన విచారణకు హాజరయ్యారని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను బహిరంగ పర్చాలని కేంద్ర మంత్రి డిమాండ్​ చేశారు. ప్రభాకర్​రావు వెనుక ఉన్న నిందితులకు శిక్ష పడాల్సిందే అని ఆయన అన్నారు.

    బీఆర్​ఎస్ (brs)​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​గా ఉన్న ప్రభాకర్​రావు ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు, సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్​ చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో గతేడాది మార్చిలో కేసు నమోదు అయింది. మరుసటి రోజు అమెరికా పారిపోయిన ప్రభాకర్​రావు ఆదివారం రాత్రి హైదరాబాద్​ చేరుకున్నారు. సోమవారం ఆయనను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్​ వ్యాఖ్యలు చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...