ePaper
More
    Homeబిజినెస్​Rapido | ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి ర్యాపిడో ఎంట్రీ.. జొమాటో, స్విగ్గీ ప‌రిస్థితి ఏంటి?

    Rapido | ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి ర్యాపిడో ఎంట్రీ.. జొమాటో, స్విగ్గీ ప‌రిస్థితి ఏంటి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rapido | ఈ రోజుల్లో చాలా మంది కూడా హోటల్స్‌కి వెళ్ల‌కుండా ఆన్‌లైన్‌లోనే ఫుడ్ డెలివ‌రీ చేసుకుంటున్నారు. స్విగ్గీ, జొమాటో సంస్థ‌ల ద్వారా త‌మ‌కు కావాల్సిన ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుంటున్నారు. డెలివరీ మార్కెట్‌లో దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ విభాగంలో ఎన్ని సంస్థలు ఉన్నా వాటిని వెనక్కి నెట్టి మొదటి రెండు స్థానాల్లో రాణిస్తూ.. మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థ ర్యాపిడో (Rapido) కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

    Rapido | కొత్త బిజినెస్‌లోకి..

    తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ (Online Food Delivery Market) రంగంలోకి ర్యాపిడో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మార్కెట్లో ఈ రెండింటికన్నా అత్యంత తక్కువ ధరకే ఫుడ్ డెలివరీని అందించేందుకు ర్యాపిడో శరవేగంగా పావులు కదుపుతోంది. ఈ వార్తలతో ఒక్కసారిగా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ (Food delivery agreement) స్విగ్గీ లిమిటెడ్ తో పాటు జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ షేర్లు సోమవారం పడిపోయాయి. నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జూన్‌ చివరి నాటికి లేదా జులై ప్రారంభంలో బెంగళూరులో డ్రైరన్‌ ఉంటుందని సమాచారం.

    ఆర్డర్‌ విలువ ఆధారంగా రెస్టారెంట్ల నుంచి ర్యాపిడో 8 నుంచి 15 శాతం కమీషన్లు వసూలు చేస్తుందని ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. రూ.400 కంటే తక్కువ ఆర్డర్‌లపై రూ.25, రూ.400 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.50 రుసుముగా వసూలు చేయనున్నట్లు సమాచారం. జొమాటో, స్విగ్గీతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ. ప్రస్తుతం ఆ రెండు సంస్థలూ 16 నుంచి 30 శాతం వరకూ రెస్టారెంట్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నాయి. 2015లో ర్యాపిడో క్యాబ్ బుకింగ్ సేవలను (Rapido cab booking services) ప్రారంభించ‌గా, ఇప్పటికే 100కుపైగా నగరాల్లో ర్యాపిడో బైక్‌, ఆటో, ఆటో షేర్‌, క్యాబ్ సేవలను అందిస్తోంది. 2025 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 500 నగరాలకు తమ క్యాబ్ సేవలను విస్తరించాలని ర్యాపిడో కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు క్యాబ్‌ సేవలందిస్తున్న ర్యాపిడో (Rapido) తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అయితే మార్కెట్లోకి అడుగుపెట్టకముందే స్విగ్గి, జోమోటాలను వణికించింది. ఫుడ్ విభాగంలో ఎంట్రీ ఇచ్చే వార్తలకే ఆ రెండు కంపెనీలు షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.

    More like this

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ : Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)లోకి వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...

    Megastar Chiranjeevi | చిరంజీవికి ఇప్ప‌టికీ త‌న భార్య అంటే అంత భ‌య‌మా.. కూతురు చెప్పిన సీక్రెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | సెలబ్రిటీలు అయినా, సామాన్యులు అయినా... భార్య ముందు భర్తలు కొంచెం...