అక్షరటుడే, వెబ్​డెస్క్​: Akhanda 2 teaser | నంద‌మూరి బాల‌య్య(Nandamuri balakrishna) వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. త‌న‌కు అచ్చివ‌చ్చిన ద‌ర్శకుడు బోయ‌పాటి శీను(Boyapati srinu)తో అఖండ 2(Akhanda 2) అనే సినిమా చేస్తున్నాడు బాలయ్య‌. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం అఖండ సినిమా సీక్వెల్‌(Akhanda 2 Sequel)గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌(14 reels plus banner)పై నిర్మాత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం విశేషం ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే నట సింహం బాలయ్య బర్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేప‌టి క్రితం విడుద‌లైంది.

Akhanda 2 teaser | అదిరిపోయిన బాలయ్య ఎంట్రీ

డైరెక్టర్ బోయపాటి(Director Boyapati) మార్క్ కనిపించేలా బాలయ్య ‘అఖండ రుద్ర తాండవం’ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘శంభో’ అంటూ హిమాలయాల బ్యాక్ గ్రౌండ్‌తో టీజర్ ప్రారంభం కాగా.. సింహం శివుడి Lord Shiva రూపంలో ఉందా అన్నట్లుగా బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది అనే చెప్పాలి. గ‌తంలో ఎప్పుడు క‌నిపించ‌ని విధంగా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. త్రిశూలం చేతబట్టి, ఒళ్లంతా విబూదితో జటాజూటధారియై.. ధర్మాన్ని కాపాడేందుకు సాక్షాత్తూ పరమశివుడే సింహం రూపంలో వస్తున్నాడా? అనేట్లుగా బాల‌య్య క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా. అమాయకుల ప్రాణాలు తీస్తావా.’ అంటూ బాలయ్య పవర్ ఫుల్‌గా చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తుంది. త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా తన మెడ చుట్టూ తిప్పుతూ.. శివుడు, నారాయణుడు కలిసి శత్రు సంహారం చేస్తున్నారా అనేట్లుగా టీజ‌ర్ Teaser క‌ట్ చేశారు. బాల‌య్య ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ యాక్షన్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తుంది టీజ‌ర్ . వేదం చదివిన శరభం యుద్ధానికి ఎదిగింది’ అంటూ సాగే డైలాగ్ మూవీపై హైప్ పదింతలు క్రియేట్ చేసింది. ఈ టీజ‌ర్ తో మూవీ కూడా సూప‌ర్ హిట్ అనే టాక్ వినిపిస్తుంది.