అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యాదగిరిరావు సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను (Governor Jishnu Dev Verma) కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో ఈనెల మూడోవారంలో జరుగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి (University Graduation Ceremony) రావాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక సహజ వనరులు ఉన్నాయని వాటిని వెలికితీసే దిశగా వివిధ రంగాల్లో లోతైన పరిశోధనలు జరగాలని గవర్నర్ ఆకాంక్షించారు.