ePaper
More
    HomeతెలంగాణBodhan | కాంగ్రెస్​లో నిరసన సెగలు.. సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో శ్రేణుల ఆగ్రహం

    Bodhan | కాంగ్రెస్​లో నిరసన సెగలు.. సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో శ్రేణుల ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bodhan | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో సీనియర్​ నేత, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి (Bodhan MLA Sudarshan Reddy) మంత్రి పదవి (ministerial post) దక్కకపోవవడంతో నిరసన సెగలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్​ నాయకులు నిరసన గళం విప్పుతున్నాయి. సీనియర్​ నేత కావడం, గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడంతో మంత్రివర్గంలో సుదర్శన్​రెడ్డికి అవకాశం వస్తుందని అంతా భావించారు. తొలి విడతలోనే ఆయన పేరు వినిపించింది. కానీ అప్పుడు పదవి వరించలేదు. తాజా మంత్రివర్గ విస్తరణలో (cabinet expansion) ఆయనకు తప్పకుండా అవకాశం వస్తుందని ఆయనతో పాటు జిల్లా నాయకులు ఆశించారు. అయితే అధిష్టానం సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పదవులు భర్తీ చేయడంతో ఆయనకు ఆయనకు రిక్త హస్తమే మిగిలింది.

    Bodhan | కార్యకర్తల అసంతృప్తి

    సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి (ministerial post) రాకపోవడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్​కుమార్​ గౌడ్​ (Mahesh Kumar Goud) ఇంటికి వెళ్లి రాజీనామా పత్రాలను (resignation papers) చీఫ్​కు అందజేశారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అలాగే మంగళవారం బోధన్​ (Bodhan) పట్టణ బంద్​కు కాంగ్రెస్​ నేతలు పిలుపునిచ్చారు. తర్వాత బంద్​ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

    Bodhan | అధిష్టానంపై గుర్రుగా..

    కష్ట సమయంలో పార్టీ వెన్నంటే ఉన్నా సుదర్శన్​ రెడ్డికి (Sudarshan Reddy) మంత్రి పదవి ఇవ్వలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలో నుంచి చేరిన వారికి మంత్రి పదవులు (ministerial posts) ఇచ్చి.. సుదర్శన్​రెడ్డికి ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేదంటే జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ భూ స్థాపితం అవుతుందని వారు హెచ్చరించారు.

    Bodhan | సుదర్శన్​రెడ్డి ఎక్కడ..!

    తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో సుదర్శన్​రెడ్డి అలక బూనినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్​ నాయకులే (Congress leaders) స్వచ్ఛందంగా ఆయనకు మద్దతుగా రాజీనామా చేయడంతో పాటు, నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై మాజీ మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...