అక్షరటుడే, వెబ్‌డెస్క్: SSC Results | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shining Stars) ప్రోగ్రాం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, రూ.20 వేల స్టైఫండ్ అందజేసింది. నిజామాబాద్ జిల్లా(Nizamabad District) చెందిన చాట్ల రవిప్రసాద్ కుమారుడు ఆదిత్య సాయి ఏపీ పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించాడు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అదనపు కలెక్టర్ గీతాంజలి శర్మ విద్యార్థికి గోల్డ్ మెడల్(Gold medal), స్టైఫండ్ చెక్కు(stipend check) అందజేశారు.
SSC Results | ఏపీ టెన్త్ ఫలితాల్లో మెరిసిన జిల్లా విద్యార్థి.. గోల్డ్ మెడల్ అందజేసిన ప్రభుత్వం
Published on
