ePaper
More
    Homeక్రైంRTC bus | ఆర్టీసీ బస్సు ఢీ: తాత మనవడి దుర్మరణం

    RTC bus | ఆర్టీసీ బస్సు ఢీ: తాత మనవడి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: RTC bus | టీవీఎస్​ ఎక్సెస్​ను(TVS XL) ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొనడంతో తాతా మనవడు మృతి చెందిన ఘటన రాజంపేట (Rajampet) మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బస్వన్నపల్లి గ్రామానికి చెందిన దోమకొండ నడిపి రాములు(50) తన మనవడు శ్రీహాన్స్(4)కు కుక్క కరవడంతో రాజంపేట పీహెచ్​సీకి టీవీఎస్ ఎక్సెస్​పై వెళ్లారు.

    పీహెచ్​సీలో వైద్యుల పరీక్షల నిమిత్తం తిరిగి వెళ్తుండగా.. రాజంపేట వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్సెస్​ వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు కింద ఎక్సెల్ వాహనం ఇరుక్కుపోవడంతో తాత మనవడు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు టైరు కింద రాములు ఇరుక్కుపోగా మనవడు శ్రీహన్స్ పక్కకు ఎగిరిపడ్డాడు. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సమాచారం తెలియడంతో గ్రామస్తులు పెద్దఎత్తున రాజాంపేటకు చేరుకున్నారు. తాత మనవడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

    More like this

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్​లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూలో (Safari World Zoo) భయానక...

    Bheemgal | పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ...