ePaper
More
    HomeజాతీయంSingapore Ship | కేర‌ళ తీరంలో అగ్నికి ఆహుతైన సింగపూర్ కంటైనర్ షిప్..

    Singapore Ship | కేర‌ళ తీరంలో అగ్నికి ఆహుతైన సింగపూర్ కంటైనర్ షిప్..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Singapore Ship | ఈ మ‌ధ్య కాలంలో షిప్‌ల ప్ర‌మాదాల‌కు సంబంధించి వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. కేరళ Kerala తీరంలోని బేపూర్ సమీప సముద్ర ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ భారీ కంటైనర్ కార్గో షిప్(Cargo ship)లో మంటలు అంటుకున్నాయి. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సముద్ర భద్రతా అధికారులు, సమీప నౌకా యాన దళాలు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఈ నౌక పేరు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

    Singapore Ship | త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి

    ఇది సింగపూర్ నావిక జెండా మోస్తూ, 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల డ్రాఫ్ట్ కలిగి ఉన్న ఓ పెద్ద పరిమాణం గల కంటైనర్ షిప్(Container ship). ఈ నౌక జూన్ 7న శ్రీలంక రాజధాని కొలంబో నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. ఇది జూన్ 10న ముంబైలోని నవ శేవా పోర్ట్(NPC Mumbai)కు చేరుకోవాల్సి ఉంది. అయితే ముంబైకి Mumbai చేరకముందే, కేరళ తీరానికి సమీపంగా ఉన్న బేపూర్ వద్ద ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే నౌకలో అగ్నిప్రమాదం ఎలా సంభవించిందన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు ఇంజిన్ విఫలమవడం లేదా విద్యుత్ వ్యవస్థలో లోపం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానం వ్యక్తమవుతోంది.

    ప్రస్తుతం నౌక చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్పందించిన భారత నౌకాదళం, తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. ఇండియన్ నేవీ తరఫున సమీపంలో గస్తీ చేస్తున్న ఓ నౌకను Ship సంఘటనా స్థలానికి తరలించారు. అంతేగాక, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, ఫైర్‌ఫైటింగ్ స్పెషల్ యూనిట్లు కూడా సిద్ధంగా ఉంచబడ్డాయి. బేపూర్ తీర ప్రాంతానికి సమీపంగా ఉన్న మత్స్యకారులు, స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...