ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | అందుకే కాళేశ్వరం రీ డిజైన్​ చేశాం.. కమిషన్​ ఎదుట హరీశ్​రావు

    Kaleshwaram Commission | అందుకే కాళేశ్వరం రీ డిజైన్​ చేశాం.. కమిషన్​ ఎదుట హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ ఎదుట మాజీ మంత్రి హరీశ్​రావు(Former Minister Harish Rao) విచారణ ముగిసింది. బీఆర్కే భవన్​లో సుమారు 45 నిమిషాల పాటు పీసీ ఘోష్​ కమిషన్(PC Ghosh Commission)​ను ఆయనను విచారించింది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై కమిషన్ ప్రశ్నించింది.తమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌ను ఎందుకు రీ డిజైన్​ చేశారని కమిషన్​ ప్రశ్నించింది. అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని మాజీ మంత్రి తెలిపారు. అలాగే సీడబ్ల్యూసీ సైతం అక్కడ నీటి లభ్యత లేదని చెప్పడంతో ప్రాజెక్ట్​ను మేడిగడ్డ(Medigadda)కు మార్చినట్లు వివరించారు.

    మంత్రుల సబ్​ కమిటీ ఎందుకు వేశారని కమిషన్​ ప్రశ్నించగా.. ఎక్కువ విస్తీర్ణంలో సాగు నీరు అందించాలనే లక్ష్యంతో సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసిందన్నారు. ఈ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, హరీశ్​రావు ఉన్నారు. సీడబ్ల్యూసీ, రిటైర్డ్​ ఇంజినీర్ల సూచలన మేరకే మేడిగడ్డ నిర్మించామని ఆయన తెలిపారు. అన్ని ఆనకట్టలను మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మించామన్నారు. ప్రాజెక్ట్​కు రుణాలు సేకరించేందుకు కాళేశ్వరం కార్పొరేషన్​ ఏర్పాటు చేశామని తెలిపారు.

    Kaleshwaram Commission | అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా

    కాళేశ్వరం విచారణ అనంతరం మాజీ మంత్రి హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామన్నారు. ఆధారాలతో సహా అన్ని కమిషన్‌ ముందు పెట్టినట్లు తెలిపారు. తమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు ప్రాజెక్ట్ స్థలాన్ని మార్చారని అడిగారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government)తో జరిపిన చర్చల మినిట్స్ కమిషన్​కు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్​ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పిందన్నారు. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కమిషన్​కు అందించినట్లు మాజీ మంత్రి తెలిపారు.

    More like this

    Local Body Elections | ఎన్నెన్ని ‘కలలో’.. స్థానిక ఎన్నికల కోసం ఆశావహుల నిరీక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై (local body elections)...

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...