ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Ramachandra Naik | సీఎంను కలిసిన డిప్యూటీ స్పీకర్​ రామచందర్ నాయక్

    Ramachandra Naik | సీఎంను కలిసిన డిప్యూటీ స్పీకర్​ రామచందర్ నాయక్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ramachandra Naik | మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచందర్ నాయక్ సోమవారం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచందర్ నాయక్ పేరును ప్రకటించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

    కాగా.. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మూడు పదవులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. బీసీ ముదిరాజ్​ కులానికి చెందిన మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​, మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్​కు మంత్రి పదవులు వరించాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులను భర్తీ చేశారు. ఈ క్రమంలో ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆ వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్​ నాయక్​ను డిప్యూటీ స్పీకర్​గా ప్రకటించారు. ప్రస్తుత స్పీకర్​ గడ్డం ప్రసాద్​ ఎస్సీ సామాజిక చెందిన వారు కాగా.. డిప్యూటీ స్పీకర్​ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.

    Ramachandra Naik | డాక్టర్​ నుంచి డిప్యూటీ స్పీకర్​గా..

    రామచందర్​నాయక్ మహబూబాబాద్​ జిల్లాలో 1975లో జన్మించారు. ఆయన 1998లో ఎంబీబీఎస్​, 2001లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్​ పూర్తి చేశారు. వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాంచందర్​నాయక్ భార్య కూడా వైద్యురాలే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తాజాగా కాంగ్రెస్(Congress)​ ఆయనను డిప్యూటీ స్పీకర్​గా ప్రకటించింది.

    More like this

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....