ePaper
More
    Homeఅంతర్జాతీయంLos Angeles | లాస్​ ఏంజెల్స్​​లో తీవ్ర ఉద్రిక్తత.. ట్రంప్​ ఆగ్రహం

    Los Angeles | లాస్​ ఏంజెల్స్​​లో తీవ్ర ఉద్రిక్తత.. ట్రంప్​ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Los Angeles | అమెరికా(America)లోని లాస్‌ ఏంజెల్స్​ నగరంలో వలసదారుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇటీవల వలసదారులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(Donald Trump)​ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ లాస్​ ఏంజెలెస్​ నగరంలో మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నగరం రణరంగాన్ని తలపిస్తోంది.

    ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) విభాగానికి వ్యతిరేకంగా 2,000 మంది ఆందోళన చేస్తున్నారు. ఒక ప్రధాన రహదారిని వారు ఆధీనంలోకి తీసుకొని కార్లకు వారు నిప్పు పెట్టారు. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపి వేశారు.

    ఆందోళనకారులను అణచివేయడానికి చర్యలు చేపట్టారు. సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్‌టౌన్‌లో ఎవరూ గుమికూడ వద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆందోళనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేయాలని ఆదేశించారు. లాస్‌ ఏంజెల్స్​లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఆందోళనల్లో మాస్క్‌ల వినియోగాన్ని ఆయన నిషేధించారు. ఆందోళనకారులను కట్టడి చేయడానికి నేషనల్​ గార్డ్స్(National Guards)​ను రంగంలోకి దింపాలని ఆయన ఆదేశించారు.

    అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్‌ను మోహరించినందుకు ప్రతిస్పందనగా ఆదివారం లాస్ ఏంజెల్స్‌లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. పోలీసులు(Police) వారిని అడ్డుకోవడానికి టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాంగ్‌లను ప్రయోగించారు. దీంతో కోపంతో రెచ్చిపోయిన వారు ప్రధాన రహదారిని అడ్డుకున్నారు.

    Los Angeles | ట్రంప్​కు లేఖ రాసిన గవర్నర్​

    లాస్​ఏంజెల్స్​​ నగరంలో నేషనల్​ గార్డ్స్​ మోహరించడంతో ఉద్రిక్తతలు పెరిగాయని గవర్నర్ గవిన్ న్యూసమ్ ట్రంప్‌కు లేఖ రాశారు. గార్డ్​​ సభ్యులను తొలగించాలని ఆయన కోరారు. ఇలా గార్డులను మోహరించడం రాష్ట్ర సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అన్నాడు. “లాస్ ఏంజెల్స్‌లో మనం చూస్తున్నది పరిపాలన ద్వారా రెచ్చగొట్టబడిన గందరగోళం” అని మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు. న్యూసమ్, ఇతర డెమొక్రాట్లు ఇటీవలి ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను(Immigration agents) లక్ష్యంగా చేసుకుని నిరసనలను అరికట్టడంలో విఫలమయ్యారు కాబట్టి నేషనల్ గార్డ్ అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు.

    కాగా.. అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్ అభ్యర్థన లేకుండా నేషనల్​ గార్డ్​ మోహరించడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటి సారి. ఆందోళనకారులు రెచ్చిపోతుండడంతో ట్రంప్​ గార్డ్స్​ను మోహరించారు. రెండు రోజుల నిరసన అనంతరం మూడో రోజు ఆయన గార్డ్స్​ను మోహరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. కాగా ఈ నగరంలో వారం రోజుల్లో వంద మంది వలసదారులను పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...