అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని కేకేవై రహదారిపై (KKY Road) పశువులు తిష్ట వేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్లపై తిరుగుతుండడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆవుల యజమానులు ఇష్టారాజ్యంగా వాటిని రోడ్లపై వదిలేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు. గతేడాది ఇలాగే జరిగితే పశువులను రోడ్లపై వదిలేసే వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లపై పశువులు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
