అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uefa Nations Trophy | స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano renaldo) గురించి ఫుట్‌బాల్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎన్నోసార్లు తమ టీమ్‌కి కప్‌లను అందించాడు. ఈ సారి మరో బిగ్ టైటిల్‌ను పోర్చుగల్(Portugal)కు అందించాడు. యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్(UEFA Nations League title)ను టీంకు అందించాడు రొనాల్డో. జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో పెనాల్టీ షూటౌట్లో 5-3 గోల్స్ తేడాతో స్పెయిన్‌ను మట్టికరిపించింది పోర్చుగల్. షూటౌట్‌కు ముందు వరకు రెండు టీమ్స్ 2-2 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. నువ్వానేనా అంటూ తలపడుతూ అభిమానులను అలరించాయి.
Uefa Nations Trophy | సేమ్ టూ సేమ్..
అయితే ఫలితం రాకపోవడంతో అదనపు సమయం కేటాయించారు. అక్కడా రిజల్ట్ రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్లో 5-3 తేడాతో పోర్చుగల్ విక్టరీ కొట్టింది. దీంతో రొనాల్డో(Ronaldo) ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. మోడర్న్ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ(Virat kohli)ని గుర్తుచేశాడతను. నా క్లబ్‌లతో నాకు చాలా టైటిల్స్ ఉన్నాయి, కానీ పోర్చుగల్‌కు గెలవడం కంటే మించింది మరేది లేదని రొనాల్డో చెప్పారు. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీని గుర్తుచేశాడు. ఆర్సీబీని 18 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ ఇటీవల దక్కింది.
ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు(Bangalore) పంజాబ్ కింగ్స్‌ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. దీంతో ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంతోషం తట్టుకోలేక గ్రౌండ్‌లోనే కూర్చుండిపోయాడు. ఆనందం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇవే మూమెంట్స్ పోర్చుగల్-స్పెయిన్ మ్యాచ్‌లో రిపీట్ అయ్యాయి. రెండో యూఈఎఫ్ఏ టైటిల్ దక్కడంతో రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి లోనయి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. దీంతో కోహ్లీ-రొనాల్డోలను పోలుస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరు తమ తమ ఆటల్లో దిగ్గజాలను, ఈ విజయాలు వారికి జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయమని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకేలా ఎమోషన్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.