ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Amaravati | మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

    Amaravati | మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati | అమరావతి మహిళలను(Amaravati Womens) వేశ్యలతో ఇద్దరు పాత్రికేయులు పోల్చడంపై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి(YS jagan)కి చెందిన ‘సాక్షి’ టీవీ చానెల్‌లో జరిగిన చర్చలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస రావు, ఆయ‌న‌తో ఇద్దరు పాత్రికేయులు పాల్గొని అమరావతి మహిళలను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

    Amaravati | కొమ్మినేని అరెస్ట్..

    అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మహిళలతో సహా పలువురు ప్రముఖులు మండిపడ్డారు. వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజుతో Krishnam raju పాటుగా షో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు.. ‘సాక్షి’ యాజమాన్యంపై పలువురు ఫిర్యాదులు చేశారు. తుళ్లూరులో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు(Senior journalist Kommineni Srinivasa Rao) అరెస్ట్ అయ్యారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావును ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైద‌రాబాద్ నుంచి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. టీవీ డిబేట్‌లో అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచార‌నే అభియోగాల‌తో న‌మోదైన కేసుల్లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావును అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

    ఇదే కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజుపై కేసు నమోదైంది. ‘సాక్షి’ Sakshi యాజమాన్యంపై ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. ‘సాక్షి’ ఛానెల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చలో.. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ వీవీఆర్‌ కృష్ణంరాజు అనే పాత్రికేయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, పాత్రికేయ సంఘాల నాయకులు ఆ వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండించారు. రైతులు, మహిళల నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో రాజధాని గ్రామాలు అట్టుడికిపోయాయి.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...