ePaper
More
    Homeబిజినెస్​Gautam Adani | అదానీ వేతనం 12 శాతం అప్.. అయినా పలువురు సిబ్బంది కన్నా...

    Gautam Adani | అదానీ వేతనం 12 శాతం అప్.. అయినా పలువురు సిబ్బంది కన్నా తక్కువే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gautam Adani | దేశంలోని అత్యంత ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ(Gautam Adani) వేతనం గతేడాది 12 శాతం పెరిగింది. అయితే ఆయన వేతనం తన కంపెనీల్లో పనిచేసే పలువురు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకంటే తక్కువ కావడం గమనార్హం.

    అదానీ గ్రూప్‌(Adani group)లో 9 లిస్టెడ్ కంపెనీలు(Listed companies) ఉన్నాయి. అందులో రెండు కంపెనీల నుంచి మాత్రమే గౌతమ్‌ అదానీ వేతనం పొందుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ రూ.9.26 కోట్ల వేతనం పొందగా.. గత ఆర్థిక సంవత్సరం(2024-25)లో అది 12 శాతం మేర పెరిగింది. రూ.వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన ఆయన గత ఆర్థిక సంవత్సరంలో రూ.10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఆయన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.26 కోట్ల వేతనం తీసుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కలిపి మరో రూ.28 లక్షలు అందుకున్నారు. అదానీ పోర్ట్స్ నుంచి రూ.1.80 కోట్ల వేతనం పొందారు. ఇతర అలవెన్సులు, లాభాల్లో వాటా కలిపి మరో రూ. 6.07 కోట్లు అందుకున్నారు.

    Gautam Adani | అదానీ కన్నా ఎక్కువ సాలరీ ఎవరికంటే..

    అదానీ గ్రూప్ కంపెనీల్లోని పలువురు ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు గౌతమ్ అదానీ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్ల వార్షిక వేతనం పొందుతుండగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ(Adani green energy) సీఈవో వినీత్ జైన్ రూ.11.23 కోట్లు వేతనం తీసుకుంటున్నారు.

    Gautam Adani | 20వ స్థానంలో..

    బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం గౌతమ్‌ అదానీ సంపద విలువ 82.5 బిలియన్‌ డాలర్లు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వల్ల ఆయన ఆస్తుల విలువ భారీగా పడిపోయింది. ఆ తర్వాత తిరిగి కోలుకుంది. ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 104 బిలియన్‌ డాలర్ల సంపదతో 17వ స్థానంలో, అదానీ 20వ స్థానంలో ఉన్నారు.

    More like this

    Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగింది. అయితే...

    Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్...

    Patanjali Shares | పతంజలి షేర్లలో మహా పతనం.. ఒక్క రోజులో 67 శాతం తగ్గిన ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Patanjali Shares | పతంజలి ఫుడ్స్‌ షేర్ల ధర గురువారం భారీగా పతనమైంది. బుధవారం...