అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Akhil-Zainab | అఖిల్-జైనబ్‌లు కొంత కాలంగా ప్రేమలో ఉండి గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు.ఇక ఈ ఏడాది జూన్ 6న పెళ్లి పీటలు ఎక్కారు. నాగార్జున వీరి వివాహాన్ని ప్రైవేట్ వేడుకగా నిర్వహించారు. ఇక జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలో అఖిల్, జైనబ్‌లు తమ స్టైలిష్ అటైర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అఖిల్ Akhil Akkinei బ్రౌన్ కలర్ సూట్‌లో అందంగా మెరవగా.. జైనబ్ గోల్డ్ కలర్ లెహంగా ధరించి ఆకట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది. అవి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అఖిల్ – జైనాబ్‌లకు టాలీవుడ్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.
Akhil-Zainab | చూడముచ్చటైన జంట..
అఖిల్-జైనబ్ రిసెప్షన్ వేడుకకి సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, నాని, నిఖిల్, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు సానా తదితరులు కూడా విచ్చేశారు. అలానే కోలీవుడ్ స్టార్ సూర్య(Kollywood star Surya), దర్శకుడు వెంకీ అట్లూరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరైనట్టు సమాచారం. నటుడు సుధీర్ బాబు కూడా అఖిల్ రిసెప్షన్‌కి అటెండ్ అయ్యాడు. నూతన దంపతులకు విషెస్ తెలిపాడు. యంగ్ హీరో అల్లరి నరేష్ సతీసమేతంగా రిసెప్షన్‌కి వచ్చాడు.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఫ్యామిలీతో వచ్చి విషెస్ తెలిపారు. అఖిల్ దంపతుల్ని ఆశీర్వదించడానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) కూడా విచ్చేసి అఖిల్‌కి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జైనాబ్ రవడ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవడ్జీ కుమార్తె కాగా, జుల్ఫీ రవడ్జీకి కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాలలో వేల కోట్ల టర్నోవర్ కలిగిన పలు వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపార పరంగా నాగార్జున Nagarjunaతో జుల్ఫీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అఖిల్, జైనాబ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ చివరకు పెళ్లిగా మారింది