ePaper
More
    Homeజాతీయంmeghalaya honeymoon case | సంచ‌ల‌నంగా మారిన హ‌నీమూన్ కేసు.. భ‌ర్త హ‌త్య‌కి కార‌ణం భార్య‌నే..!

    meghalaya honeymoon case | సంచ‌ల‌నంగా మారిన హ‌నీమూన్ కేసు.. భ‌ర్త హ‌త్య‌కి కార‌ణం భార్య‌నే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇటీవలి కాలంలో మ‌ధ్య భార్యభ‌ర్త‌ల బంధం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. భార్య‌లు ప‌క్కా ప్లాన్‌తో భ‌ర్త‌ల‌ని చంప‌డం స‌భ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా చేస్తుంది. తాజాగా కొత్త‌గా పెళ్లైన ఓ జంట హనీమూన్‌కు వెళ్ల‌గా, ఆ న‌వ దంపతుల పర్యటన అత్యంత దారుణంగా ముగిసింది.

    భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన కేసులో భార్యే ప్రధాన సూత్రధారి అని తేలడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేఘాలయలో Meghalaya honeymoon Missing case జరిగిన ఈ షాకింగ్ ఘటనలో మృతుడి భార్యతో సహా మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భాధితుడికి అత్యంత సన్నిహితులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మే11 వివాహం, 20న హనీమూన్‌… షిల్లాంగ్‌ పర్యటనలో అదృశ్యం. దేశాన్ని కుదిపేసింది ఈశాన్య రాష్ట్రంలోని ఈ మర్డర్‌ అండ్‌ మిస్సింగ్‌ మిస్టరీ.

    meghalaya honeymoon case : మిస్ట‌రీ వీడింది..

    మేఘాలయలో ఇండోర్‌ జంట(Indore couple) అదృశ్యం మిస్టరీ దర్యాప్తు సంస్థలకు చిక్కుముడిలా మారింది. కాని ఎట్ట‌కేల‌కి ఈ కేసుని చేధించిన పోలీసులు భయానక నిజాలను వెల్లడించారు. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్‌ చంపించినట్లు పోలీసుల ప్రకటించారు. భర్త హత్య కోసం భార్య సుపారీ ఇచ్చినట్లు మేఘాలయ పోలీసులు తేల్చారు.

    మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు Indoor చెందిన రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ రఘువంశీ ఇటీవలే వివాహం చేసుకుని హనీమూన్(honeymoon) కోసం మేఘాలయ వెళ్లారు. మే 23న వీరిద్దరూ అదృశ్యమయ్యారు. అంతకుముందు షిల్లాంగ్‌లోని ఓ హోటల్ బయట, ఆ తర్వాత నాంగ్రియాట్ గ్రామంలో మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.

    జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ (​​East Khasi Hills) జిల్లా పరిధిలోని సోహ్రా (Sohra) ప్రాంతంలో ఒక జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు Police గుర్తించారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ఆయ‌న‌ను కత్తితో దారుణంగా పొడిచి చంపినట్లు నిర్ధార‌ణ అయింది. సంఘటనా స్థలం నుంచి పలు విలువైన వస్తువులు కూడా మాయమైనట్లు తేలింది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు భావించినప్పటికీ, లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విష‌యం బయటపడింది. రాజా రఘువంశీని హత్య చేయించింది భార్య సోన‌మ్ అని, మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను కిరాయికి మాట్లాడుకుని సోనమ్ ఈ ఘాతుకానికి పాల్పడిందని వారు వెల్లడించారు.

    కొన్ని రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన సోనమ్, ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘాజీపూర్(Ghazipur district) జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్‌(Nandaganj police station)లో లొంగిపోవడంతో ఈ కేసులో కీలక లీడ్‌ లభించింది. అనంతరం ఇండోర్, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సమన్వయంతో హత్యతో సంబంధమున్న మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మేఘాలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదంటున్న ప్రభుత్వం.. కేసుని సీరియస్‌గా తీసుకుంది. హత్య -అదృశ్యం మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. కాగా, రాజా రఘువంశీ హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...