ePaper
More
    HomeజాతీయంKarnataka | కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవాలన్న భర్తకు మొదటి భార్య చెప్పుతో గుణపాఠం!

    Karnataka | కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవాలన్న భర్తకు మొదటి భార్య చెప్పుతో గుణపాఠం!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఈ సీన్ చూస్తే సినిమా సన్నివేశమా? హాస్యనాటకమా? అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. అసలు కథను విన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు, నవ్వుతున్నారు, బాధపడుతున్నారు కూడా. ఇది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకున్న అసలైన సంఘటన.

    చిక్‌మంగ‌ళూరు జిల్లా(Chikmagalur district)కు చెందిన కార్తీక్ Karthik అనే వ్యక్తి, నాలుగేళ్ల క్రితం తనూజ అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ శుభసంధర్భంలో కార్తీక్ కుటుంబానికి తగినంత కట్నం ఇచ్చినట్లు సమాచారం. జీవితంలో ఇద్దరూ కలిసి అడుగులు వేస్తారని, కుటుంబం ఆనందంగా సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, కార్తీక్ మనసు మాత్రం వేరే విధంగా వెళ్లింది.

    Karnataka : తగిన బుద్ధి..

    కొంత కాలానికి కార్తీక్ కట్నం మీద దురాశ చూపడం మొదలుపెట్టాడు. తనూజతో కలిసి గడిపే జీవితం కన్నా, ఇంకొకరిలో కొత్తగా లాభం కనిపించింది. మరొక కుటుంబం నుంచి పెద్ద మొత్తం కట్నం వస్తుందని ఊహించి, రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఈసారి అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల మధ్య పెళ్లి జరగాలన్నది అతని కోరిక.

    కానీ అతని పథకం అతని భార్యకు తెలియకుండా పూర్తవుతుందని తాను ఊహించలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవించే తనూజ, భర్త Husband తీరులో మార్పు గమనించి అతని చలాకీతనాన్ని పరిశీలించసాగింది. చివరికి నిజం తెలిసింది. కార్తీక్ మరో పెళ్లి చేసుకుంటున్నాడన్న సమాచారం ఆమెకు చేరింది.

    ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రులతో కలిసి చిత్రదుర్గ గాయత్రి కళ్యాణ మండపాని(Chitradurga Gayatri Kalyana Mandapam)కి వెళ్లింది. అప్పటికే కార్తీక్ శుభకార్యానికి సిద్ధంగా ఉండగా, తనూజ Tanooja అతన్ని నిలదీసింది. కార్తీక్ సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవ‌డానికి ప్రయత్నించగా, తనూజ ఆగ్రహానికి లోనైంది. కట్నం కోసం దురాశతో రెండో పెళ్లికి సిద్ధమైనందుకు పెళ్లి మండపంలోనే అతని ముఖంపై చెప్పుతో కొట్టి తగిన గుణపాఠం చెప్పింది.. ఈ దృశ్యం చూసిన కార్తీక్ తల్లిదండ్రులు, రెండో వధువు కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెళ్లి అట్టహాసంగా జరగాల్సిన చోట… అపహాస్యం, అవమానం చోటు చేసుకుంది. ఈ ఘటన అక్కడి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా(social media)లో షేర్ చేశారు. వీడియో క్షణాల్లో వైరల్ అయింది.

    కట్నం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకునే వారిని సమాజం(Society) సహించదు.మహిళలు ఇక మౌనంగా ఉండే రోజులు పోయాయి. అవమానానికి తలవంచే రోజులు పోయాయి.ఆడపిల్లలు న్యాయం కోసం పోరాడతారు, ఎంతటి పరిస్థితి అయినా ఎదుర్కొంటారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...