Drunkard | ఫూటుగా తాగి.. పోలీసులకు ఫోన్​ చేసి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Drunkard | ఫూటుగా తాగి.. పోలీసులకు ఫోన్​ చేసి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తాగుబోతు అర్ధరాత్రి పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేశాడు. ఫూటుగా తాగి సదరు ఉన్నతాధికారికి ఫోన్​ చేసి బారులో బిల్లు కట్టడానికి డబ్బులు పంపాలంటూ ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్​ నగరంలోని పులాంగ్​ చౌరస్తాలో ఉన్న బార్​లో ఓ తాగుబోతు నిన్నరాత్రి మస్త్ గా మందేశాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి అతడిది. ఇంతలో వెయిటర్ రూ.3 వేల​ బిల్లు తీసుకొచ్చి అతగాడికి ఇచ్చాడు. జేబులో డబ్బులు లేకపోవడంతో ఆ తాగుబోతు జేబులో నుంచి ఫోన్​ తీసి డయల్​ చేశాడు. అదికాస్త పోలీసు ఉన్నతాధికారి(senior police officer)కి వెళ్లింది. ఆ అధికారి ఫోన్​ లిఫ్ట్ చేయగానే.. బార్​లో రూ.3 వేల బిల్లు అయిందని డబ్బులు పంపాలని సతాయించాడు.

దీంతో ఆ అధికారి నాలుగో ఠాణా పోలీసులకు చెప్పడంతో వారు.. సదరు బార్​కు చేరుకున్నారు. అసలు విషయం గ్రహించిన తాగుబోతు అక్కడి నుంచి అప్పటికే పలాయనం చిత్తగించాడు. ప్రస్తుతం పోలీసులు అతగాడి కోసం వెతుకుతున్నారు.