అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Expansion | మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy) ఇంటికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) వెళ్లారు. మల్‌రెడ్డి కొంతకాలంగా మంత్రి పదవి కోసం డిమాండ్ చేస్తున్నారు.
రంగారెడ్డి(Ranga Reddy), హైదరాబాద్ (Hyderabad) జిల్లాల నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదని ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గం అడ్డయితే.. తాను రాజీనామా చేసి ఇతరులను గెలిపిస్తానని గతంలో వ్యాఖ్యానించారు. వారికైనా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే విషయమై జానారెడ్డి (Janareddy) అధిష్టానానికి లేఖ రాయడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
Cabinet Expansion | సామాజిక సమీకరణాలతో..
అయితే తాజాగా మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కాంగ్రెస్ (Congress) సామాజిక సమీకరణాలను ప్రాధాన్యంలోకి తీసుకుంది. మాల సామాజికి వర్గానికి చెందిన గడ్డం వివేక్(చెన్నూర్), బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వాకిటి శ్రీహరి(మక్తల్), మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(ధర్మపురి)కు పదవులు కేటాయించింది. వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డికి భంగపాటు ఎదురైంది.
Cabinet Expansion | బుజ్జగింపులు షురూ
తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో మల్‌రెడ్డి అలిగారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఆయనను బుజ్జగించేందుకు మల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మంత్రి పదవి దక్కని ఆశావహులను బుజ్జగించేందుకు పీసీసీ చర్యలు చేపట్టింది. వారితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడనున్నట్లు తెలిసింది. భవిష్యత్‌లో వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం.