ePaper
More
    HomeజాతీయంNo Tax | అక్కడ నో ట్యాక్స్.. ఎంత సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు

    No Tax | అక్కడ నో ట్యాక్స్.. ఎంత సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: No Tax | పన్ను చెల్లింపుదారులు, ఆదాయ రకాలను బట్టి ట్యాక్స్ రేట్లు మారుతుంటాయి. మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆదాయపు పన్ను (Income tax) కట్టాల్సి ఉంటుంది. కానీ, ఆ ఒక్క రాష్ట్రం మాత్రం దీనికి మినహాయింపు.. ఆ రాష్ట్రంలో ఎంత సంపాదించినా ఎలాంటి పన్ను విధించరు. జాబ్, వ్యాపారం సహా ఏ విధంగా ఆదాయం పొందినా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రం గురించి తెలుసుకుందామా..

    దేశంలో అర్హతను బట్టి ఆదాయపు పన్ను (Income tax) చెల్లించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పొందేందుకు స్టాండర్డ్‌ డెడక్షన్ (Standard deduction) సౌకర్యం ఉంటుంది. అంతకుమించి ఆదాయం ఉన్నవారు తప్పక ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. సిక్కిం Sikkim state రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. అక్కడి పౌరులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల ద్వారా ఎంత ఆదాయం పొందినా కూడా అక్కడ ఎలాంటి ట్యాక్స్ విధించరు. రాజ్యాంగంలోని Article 371(F), Income Tax Actలోని Section 10(26AAA) ప్రకారం సిక్కిం రాష్ట్రానికి ఈ హక్కు కల్పించారు.

    No Tax | ఎందుకు మినహాయించారంటే..

    1975లో సిక్కిం (Sikkim) భారతదేశంలో విలీనమైంది. ఆ సమయంలో సిక్కిం రాజు ఒక ప్రత్యేక షరతు విధించారు. 1975కు ముందు సిక్కింలో అనుసరిస్తున్న పన్ను చట్టాలను కొనసాగించాలని కోరారు. ఆ ఒప్పందంలో భాగంగా సిక్కింకు ట్యాక్స్ మినహాయింపు హక్కు చట్టబద్ధంగా అమలులోకి వచ్చింది. Income Tax Act లోని Section 10(26AAA) ప్రకారం Sikkimes అని గుర్తింపు పొందినవారు ఏ విధంగా ఆదాయం పొందినా పన్ను నుంచి పూర్తి మినహాయింపు పొందుతారు.

    అయితే ఈ ప్రయోజనం దక్కాలంటే చట్ట ప్రకారం.. సిక్కింలో గుర్తింపు పొందిన వ్యక్తులై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే పన్ను మినహాయింపులు లభిస్తాయి. పన్ను భారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది స్థానిక వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారని, దీంతో వ్యాపారాలు అభివృద్ధి చెంది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించారు. కాగా.. ఇది సిక్కిం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిలో మార్పులు చేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...