ePaper
More
    Homeక్రీడలుRinku Singh | నిశ్చితార్థ వేడుక‌లో అంద‌రి ముందే ఏడ్చేసిన రింకూ సింగ్ భార్య‌

    Rinku Singh | నిశ్చితార్థ వేడుక‌లో అంద‌రి ముందే ఏడ్చేసిన రింకూ సింగ్ భార్య‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rinku Singh | భార‌త యువ క్రికెట‌ర్ రింకూ సింగ్ (Rinku Singh).. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో (MP Priya Saroj) లక్నోలో జరిగిన ఒక గ్రాండ్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమం జూన్ 8, 2025న లక్నోలోని ది సెంట్రమ్ అనే 5-స్టార్ హోటల్‌లో అట్ట‌హాసంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక‌కి క్రికెట్, రాజకీయ (Politics) రంగాల నుంచి ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నిశ్చితార్థ వేడుక‌లో రింకు సింగ్ (Rinku singh), ప్రియా సరోజ్ ఇద్దరూ తెలుపు, గులాబీ రంగుల దుస్తులలో మెరిసిపోయారు. ఇక హాల్ అంతా పూల అలంకరణలు, ప్రకాశవంతమైన లైట్లతో అద్భుతంగా ముస్తాబైంది.

    Rinku Singh | భావోద్వేగంతో..

    300 మందికి పైగా అతిథులు హాజరయ్యే సామర్థ్యం గల ఈ వేదికపై క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ నిశ్చితార్థ వేడుక‌కి మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్ (Praveen Kumar), పీయూష్ చావ్లా, ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులలో సమాజ్ వాదీ పార్టీ (Samajwadi party) అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, ప్రియా సరోజ్‌కు సన్నిహితురాలైన మరో పార్లమెంటేరియన్ ఇక్ర హసన్, సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

    అయితే నిశ్చితార్థ వేడుక‌లో ప్రియా స‌రోజ్ (Priya Saroj) ఎమోష‌న‌ల్ కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎంగేజ్‌మెంట్‌ ఈవెంట్‌లో ఉంగరాలు మార్చుకున్న తర్వాత రింకూను పట్టుకొని ఏడ్చేసింది ప్రియా సరోజ్. కళ్ల నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించేందుకు ప్రయత్నిం చేసిన అవి ఆగ‌క పోవ‌డంతో రింకూ చేతిని ప‌ట్టుకుంది. ఇది చూసిన వారు అవి క‌న్నీళ్లు కాదు ఆనంద భాష్పాలు అని అంటున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 18న వారణాసిలో రింకూ-ప్రియ (Rinku-priya) పెళ్లి జరగనుంది. ఇక నిశ్చిత‌ర్థ వేడుక కోసం ఒక గ్రాండ్ 12×16 అడుగుల స్టేజ్ ఏర్పాటు చేశారు. లక్నో (Luknow) వంటకాలతో పాటు, ఈ జంట స్వయంగా ఎంపిక చేసుకున్న అనేక వంటకాలతో కూడిన మెనూను అతిథులు ఆస్వాదించారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this