ePaper
More
    HomeసినిమాPawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ లుక్ వైరల్.. షార్ట్, టీషర్ట్‌లో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన జనసేనాని!

    Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ లుక్ వైరల్.. షార్ట్, టీషర్ట్‌లో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన జనసేనాని!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ట్రెండ్ ఫాలో అవడని, తానే ట్రెండ్ సెట్ చేస్తాడని ఆయ‌న అభిమానులు అంటుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్‌స్టార్‌గా, రాజకీయాల్లో జనసేనాని‌గా (Janasena) అశేష ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాడు. తాజాగా ఆయన ఫిట్‌నెస్ లుక్ (Fitness look) మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. విజయవాడ (Vijayawada) రహదారులపై ఏర్పాటు చేసిన సెలూన్ ఓపెనింగ్‌కి వ‌చ్చిన ప‌వ‌న్ స్కై బ్లూ టీ షర్ట్, బ్లాక్ షార్ట్, ఫుల్ టైట్ షూస్, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో అంద‌రూ నోరెళ్ల‌పెట్టేలా చేశారు. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ప్రత్యక్షమవ్వడం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

    Pawan Kalyan | లుక్ అదిరింది..

    ఉప ముఖ్యమంత్రి (Deputy minister) స్థాయిలో బిజీగా ఉండే వ్యక్తి ఇలా సాధారణ గెటప్‌లో, ఎనర్జిటిక్‌గా కనిపించడాన్ని చూసి చాలామంది “ఇది సినిమా సీన్ కాదు కదా?” అని ఆశ్చర్యపోయారు. ఓపెనింగ్ కార్యక్రమం ముందుగా ప్రకటించబడకపోవడం వల్ల, జిమ్ (GYM) నుండి డైరెక్ట్‌గా సెలూన్ ఓపెనింగ్‌కి వ‌చ్చాడేమో అని అంద‌రూ ముచ్చ‌టించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయన లుక్ చూసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు. ఓపెనింగ్ (Opening) త‌ర్వాత ప‌వ‌న్ త‌న అభిమానులకు అభివాదం చేసి, కొంతసేపు అక్కడ గడిపిన తర్వాత తన కాన్వాయ్‌తో వెళ్లిపోయారు. ఇప్పుడు పవన్ లుక్, ఫిట్‌నెస్, లైవ్ ప్రెజెన్స్ అన్నీ ఒకేసారి ట్రెండింగ్ లోకి వచ్చాయి.

    ఇక ఇటీవల విడుదల కావాల్సిన పవన్ నటించిన “హరిహర వీరమల్లు” (Hari Hara veeramallu) సినిమా మళ్లీ వాయిదా పడిన నేపథ్యంలో ఆయన రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు . అయితే, సినిమా షూటింగ్‌లకు సమయం కేటాయించి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ, రాజకీయ బాధ్యతల వల్ల అది సాధ్యపడడం లేదు. అయితే ఏదోలా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పూర్తి చేశారు. ఇక రీసెంట్‌గా ఓజీ కూడా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చిత్రం ఒక్క‌టే మిగిలి ఉంది. ఇది కూడా వీలైనంత త్వర‌గా ప‌వ‌న్ పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....